కథ : ఎదుటివారి ఆనందమే తన ఆనందం
ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్ద ఆస్తి లేకపోయినా, ఒక చిన్న పొలం, రెండు ఎద్దులు, ఒక గుడిసె మాత్రమే ఉండేవి. రామయ్య తనకు ఉన్నదానితో ఆనందంతో ఉండే వాడు. అంటే కాకుండా ఇతరుల ఆనందంతో ఉంటే రామయ్య ఎంతో ఆనందపడేవాడు.
గ్రామంలో ఎవరికైనా పంట బాగా వచ్చిందంటే, అతను తన పంట గురించి ఆలోచించకుండా వారిని శుభాకాంక్షలు చెబుతూ సంతోషించేవాడు. ఎవరైనా కొత్త ఇల్లు కట్టినా, కొత్త బట్టలు వేసుకున్నా, పిల్లలు చదువులో బాగా రాణించినా.. రామయ్య వారి ఆనందాన్ని తన ఆనందంగా గుండె నిండా ఆనందపడేవాడు.
ఒక రోజు గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. అందరూ వారి వారి కుటుంబ సభ్యులందరూ కొత్త బట్టలు వేసుకుని, రుచికరమైన వంటలు వండుకొని తిన్నారు. రామయ్య కుటుంబానికి మాత్రం ఆ రోజు బట్టలు కొనలేకపోయాడు. అంతే కాదు ఇంట్లో వంటలు కూడా అంతంత మాత్రానే వండుకున్నారు. అయినా అతను ఏమాత్రం బాధపడలేదు. "మన వాళ్లందరూ సంతోషంగా ఉన్నారు కదా, అదే తన ఆనందం" అని ఏంతో సంతోషంగా కనిపించాడు.
ఇది చూసిన గ్రామ పెద్దలు రామయ్యను దగ్గరకు పిలిచి అన్నారు:
"నీ మనసు ఎంత గొప్పది రామయ్యా! ఇతరుల సంతోషాన్ని చూసి మీలా ఎవరు ఇంతగా ఆనందపడతారు? మాకన్నా నిజమైన ధనవంతుడు నువ్వే."
ఆ రోజు నుండి గ్రామంలోని పిల్లలు, పెద్దలు అందరూ రామయ్యను ఒక ఆదర్శంగా తీసుకున్నారు.
నీతి :
మనకు ఉన్నదానితో సంతోషపడటం మాత్రమే కాదు, ఎదుటివారి ఆనందాన్ని కూడా తన ఆనందంగా భావించగలిగినవాడే నిజమైన మహానుభావుడు. భగవద్గీత చెప్పేది ఇదే.
0 Comments